వారికి క్షమాపణలు తెలిపిన “అఖండ” నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి!

Published on Nov 28, 2021 8:06 pm IST

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రం కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం పట్ల చిత్ర నిర్మాత అయిన మిరియాల రవీందర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

అఖండ ప్రీ రిలీజ్ వేడుక ను గ్రాండ్ సక్సెస్ చేసిన నందమూరి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఈవెంట్ ను ఔట్ డోర్ లో చేద్దాం అను అనుకున్నట్లు తెలిపారు. అయితే వాతావరణ పరిస్థితులు బాగొలేకపోవడం తో శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు, సినీ అభిమానులు భారీ సంఖ్యలో హాజరు అయినట్లు పేర్కొన్నారు. లోపల స్థలం సరిపోక పోవడం తో చాలా మంది అభిమానులు బయటే ఉండిపోయారు అని తెలిసింది, వారికి ఈ సంధర్భంగా క్షమాపణలు తెలియజేస్తున్నా అని అన్నారు.

సంబంధిత సమాచారం :