ఫుల్ స్వింగ్ లో అఖండ ప్రమోషన్స్!

Published on Nov 23, 2021 10:38 pm IST


నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్ నటిస్తుండగా, జగపతి బాబు, శ్రీకాంత్ లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 2 వ తేదీన విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ను 27 వ తేదీన సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో జరపనున్నారు. అంతేకాక సరికొత్త పోస్టర్ లతో సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబో లో వస్తున్న సినిమా కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :