అఖండ విడుదల అయ్యేది అప్పుడేనా?

Published on Oct 4, 2021 2:40 pm IST


బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు సినిమా పై ఆసక్తి ను పెంచేశాయి. అంతేకాక ఈ చిత్రం లో హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అయితే బోయపాటి శ్రీను విలనిజం ను చాలా డిఫెరెంట్ గా మరియు పవర్ ఫుల్ గా చూపిస్తారు. క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది.

అయితే ఈ చిత్రాన్ని నవంబర్ 4 వ తేదీన ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :