షూటింగ్ పూర్తి చేసుకున్న బాలయ్య “అఖండ” చిత్రం

Published on Oct 5, 2021 2:30 pm IST


బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. అంతేకాక ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్స్ త్వరలో ఒక్కొక్కటి గా వెల్లడి కానున్నాయి. ఈ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ చిత్రం లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకాంత్, పూర్ణ, జగపతి బాబు లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :