వైజాగ్ లో రేపు అఖండ సక్సెస్ సెలబ్రేషన్స్!

Published on Dec 8, 2021 8:09 pm IST


నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వారం రోజుల్లో హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో ఫుల్ రన్ అవుతోంది. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సక్సెస్ ఈవెంట్ ను జరుపుకోనుంది.

వైజాగ్ లో డిసెంబర్ 9 వ తేదీన అఖండ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. ఈ సక్సెస్ వేడుక లో అఖండ చిత్ర యూనిట్ హాజరు కానుంది. ప్రేక్షకులు సైతం ఈ వేడుక కి భారీ గా హాజరు అయ్యే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రానికి థమన్ సంగీతం అందించగా, ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

సంబంధిత సమాచారం :