ఆఫ్ లైన్ రచ్చ షురూ చేసేసిన “అఖండ”..!

Published on Nov 16, 2021 3:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “అఖండ”. భారీ అంచనాలతో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక దానితో పాటుగా సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసేయడంతో ఈ భారీ సినిమాపై అంచనాలు ఆసక్తి మరింత పెరిగింది.

అయితే ఆల్రెడీ ఆన్ లైన్ లో మంచి బజ్ తో ఉన్న ఈ చిత్రం ఇక ఆఫ్ లైన్ ప్రమోషన్స్ ని షురూ చేసేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇక్కడ నుంచి అఖండ రీచ్ ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పాలి. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం అందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :