లేటెస్ట్..”పెదకాపు” ప్రాజెక్ట్ తో అఖండ ప్రొడక్షన్ హౌస్.!

Published on Jun 2, 2023 12:00 pm IST

మన టాలీవుడ్ సినిమా దగ్గర తమ మొదటి సినిమా అఖండ తోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్స్. మరి ఇలాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత రీసెంట్ గానే మేకర్స్ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తో అయితే అనౌన్స్ చేశారు. మరి అప్పుడు పీకే అంటూ హైలైట్ చేసిన మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా బిగ్ అప్డేట్ ని అందించారు.

ఈ చిత్రంతో కొత్త హీరో విరాట్ కర్ణ ని పరిచయం చేస్తూ “పెద కాపు 1” అనే చిత్రాన్ని అయితే ఇప్పుడు ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో రిలీజ్ చేశారు. మరి ఈ సాలిడ్ దీనితో అయితే ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి ఒక ఇంట్రెన్స్ రా డ్రామా రాబోతుంది అని అర్ధం అవుతుంది. అలాగే టైటిల్ తోనే ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తున్నట్టుగా కూడా అర్ధం అయ్యింది. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించనుండగా మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మాణం వహిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ ని సెట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :