యూఎస్ లో “అఖండ” హవా..రికార్డు ఫిగర్ కి దగ్గరలో.!

Published on Dec 12, 2021 12:00 pm IST


నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ రోరింగ్ బ్లాక్ బస్టర్ చిత్రం “అఖండ”. భారీ వసూళ్లతో ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా విజయ ఢంకా మోగించగా ఓవర్సీస్ లో కూడా అఖండ భారీ విజయాన్ని నమోదు చేసి కాసుల వర్షం కురిపించింది.

అయితే యూఎస్ మార్కెట్ లో మాత్రం అఖండ ప్రీమియర్స్ నుంచే దమ్ము చూపించడం స్టార్ట్ చేసింది. దీనితో ఈ చిత్రం స్యూర్ షాట్ గా అక్కడ 1 మిలియన్ మార్క్ ను కొడుతుంది అని అంచనా వేసారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆ సాలిడ్ ఫిగర్ కి ఎంతో దూరంలో లేదు లేటెస్ట్ గా ఈ చిత్రం అక్కడ 9 లక్షల 50 వేల డాలర్స్ రాబట్టినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

ఇక ఇంకో 50 వేల డాలర్లు కనుక వచ్చినట్టు అయితే రికార్డు ఫిగర్ 1 మిలియన్ ని ఈ చిత్రం కొల్లగొట్టనుంది. మరి ఇది కూడా పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. మరి ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ విలన్ గా నటించారు. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :