“అఖండ” రిలీజ్ డేట్ పై కూడా అప్పుడే క్లారిటీ.?

Published on Aug 24, 2021 11:01 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం “అఖండ” అనే సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం కోసం బాలయ్య అభిమానులు ఎప్పుడు నుంచో చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

కానీ దానికి ముందు ఈ చిత్రం నుంచి థమన్ ఫస్ట్ సింగిల్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దీనిని అతి త్వరలోనే విడుదల చేయనుండగా బహుశా ఇదే అప్డేట్ తో అఖండ రిలీజ్ డేట్ పై కూడా ఒక క్లారిటీ రానున్నట్టుగా తెలుస్తుంది. ఈ రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా అన్నది కూడా సర్వత్రా ఇంట్రెస్టింగ్ గా మారిన ప్రశ్నగా నిలిచింది. మరి ఈ అప్డేట్ ని కూడా అందులో మిళితం చేస్తారో లేదా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :