నైజాంలో “అఖండ” గర్జన..బ్రేకీవెన్ తో వసూళ్ల వివరాలు ఇవే.!

Published on Dec 5, 2021 10:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన హ్యాట్రిక్ చిత్రం “అఖండ”. ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రం మోస్ట్ అవైటెడ్ గా ఈ డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ ని అందుకుంది. అంతే కాకుండా బాలయ్య కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ తో స్టడీ వసూళ్లతో అదరగొడుతుంది.

ఇక ముఖ్యంగా అయితే కీలక ఏరియా అయినటువంటి నైజాం లో అఖండ గర్జన మామూలుగా లేదు.. మూడో రోజు షేర్ తో ఈ చిత్రం నైజాం లో 2.5 కోట్ల షేర్ ని రాబట్టి అక్కడ మూడు రోజులకి 9.10 కోట్లను రాబట్టింది. ఈ మార్క్ తో ఈ చిత్రం బ్రేకీవెన్ ని కొట్టేసి బాలయ్య మరియు బోయపాటిల మ్యాజిక్ మళ్ళీ చూపించారని చెప్పొచ్చు. ఇక నుంచి ఫైనల్ రన్ ఎంతవరకు రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :