రాబోయే భారీ చిత్రాలకు “అఖండ” విజయం ఖచ్చితమైన భరోసా.!

రాబోయే భారీ చిత్రాలకు “అఖండ” విజయం ఖచ్చితమైన భరోసా.!

Published on Dec 5, 2021 11:15 PM IST


టాలీవుడ్ సినిమాకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది.. ఎన్ని కరోనాలు వచ్చినా బాక్సాఫీస్ పరంగా థియేటర్స్ లో సినిమాలను ఇష్టపడి ఆదరించడంతో తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ముందుంటారని మళ్ళీ ప్రూవ్ చేశారు. ఒక సరైన సినిమా పడితే థియేటర్స్ కి జనం తరలి వస్తారని తాజా చిత్రం “అఖండ” ఆ సరైన సినిమాగా నిలిచి నిరూపించింది.

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రం కరోనా రెండో వేవ్ అనంతరం అయ్యిన అతి పెద్ద రిలీజ్. మరి ఇలాంటి సినిమా ఎన్నో అంచనాలతో ఉండేది బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది. తెలుగు ప్రేక్షకులు ఎలాంటి ఆదరణను అందిస్తారు? అని తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూడగా దానికి వారు మంచి సమాధానం ఇచ్చారు.

బాలయ్య బోయపాటి ల అఖండ కి నిజంగానే అఖండమైన విజయాన్ని అందించి రాబోయే భారీ సినిమాలకు ఖచ్చితమైన భరోసా ఇచ్చేలా చేశారు. ఇక ఈ డిసెంబర్ లో ఐకాన్ స్టార్ భారీ సినిమా “పుష్ప”, నాని “శ్యామ్ సింగ రాయ్” ఆ తర్వాత జనవరిలో పలు బిగ్గెస్ట్ సినిమాలు ఉన్నాయి.

రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం”, ప్రభాస్ “రాధే శ్యామ్” అలాగే పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్”, మెగాస్టార్ సినిమా “ఆచార్య” లాంటి మాస్ మరియు క్లాస్ భారీ చిత్రాలు అన్నిటికీ కూడా అఖండ విజయం ఒక ఖచ్చిత నమ్మకాన్ని అయితే ఇచ్చిందని చెప్పడంలో సందేహం లేదు.

మిగతా కంటెంట్ ని అంతా పక్కన పెట్టినా ఇటువంటి భారీ చిత్రాలకు మొదటి రోజే సాలిడ్ ఓపెనింగ్స్ ని ఇచ్చే రోజులు మళ్ళీ వచ్చేశాయని ఒకవేళ సినిమా బాగుంటే తెలుగు స్టేట్స్ లోని అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఆడియెన్స్ మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి వస్తారని “అఖండ” చిత్రం నిరూపించింది.

సో ఇక రానున్న రోజుల్లో చిత్రాలకు ఎటువంటి డోకా లేదని చెప్పాలి. అయితే ఇక్కడే ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఎలా అయితే థియేటర్స్ లో ఇప్పుడు మనం సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నామో అంతే బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఉంది.

క్రమం తప్పకుండ మాస్క్ ధరించడం, ఇతర జాగ్రత్తలు పాటించడం ముఖ్యంగా వీలైనంత త్వరగా వాక్సిన్ వేసుకోవడంతో మన వినోదాన్ని ఇలా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అందుచేత మన ఆరోగ్యం, మన వినోదం మన చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి నిర్లక్ష్యం తగదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు