AMB మాల్ లో అఖండ టీమ్…!

Published on Dec 2, 2021 9:00 pm IST


నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్ లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

తాజాగా చిత్ర యూనిట్ AMB మాల్ లో అఖండ చిత్రం ను చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుత సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం వేరే లెవెల్ లో ఉందంటూ అభిమానులు చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :