కేసీఆర్ పై బాలయ్య ప్రశంసలు.. యాదాద్రి ఒక అద్భుతం !

Published on Dec 27, 2021 1:10 pm IST

‘అఖండ’ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ పై దండయాత్ర చేసి.. మొత్తానికి ‘అఖండ’తో అఖండమైన విజయాన్ని నమోదు చేశాడు. అలాగే అఖండ అద్భుతమైన కలెక్షన్లను కూడా రాబట్టింది. కాగా తన సినిమా అఖండమైన విజయం సాధించడంతో బాలయ్యతో పాటు అఖండ సినిమా యూనిట్ కూడా సక్సెస్ లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని పుణ్యక్షేత్రలను దర్శించుకుంటున్నారు.

ఈ క్రమంలో యాదాద్రి దర్శనానికి కూడా అఖండ టీమ్ వెళ్ళింది. ఈ సందర్భంగా బాలయ్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలయ్య మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా జరిగింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతమైన దేవాలయం యాదాద్రి. యాదాద్రి ఒక అద్భుతం’ అని బాలయ్య కామెంట్స్ చేశారు.

అలాగే తమ ప్రయాణం గురించి బాలయ్య మాట్లాడుతూ.. ‘ అఖండ సినిమా సక్సెస్ లో భాగంగా తెలుగు రాష్ట్రాలల్లో అన్ని పుణ్యక్షేత్రలను దర్శించుకున్నాం అందులో భాగంగానే యాదాద్రి దర్శనానికి వచ్చాము. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికి ఉంది’ అని బాలయ్య తెలిపారు.

సంబంధిత సమాచారం :