ఆకట్టుకుంటున్న అఖండ టైటిల్ సాంగ్..!

Published on Nov 8, 2021 1:00 pm IST

నందమూరి బాలకృష్ణ మరొకసారి తన నట విశ్వ రూపం చూపించేందుకు సిద్దం అవుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ కి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి భం అఖండ అంటూ టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ నేడు తాజాగా విడుదల చేయడం జరిగింది. అనంత శ్రీరామ్ భం అఖండ కి లిరిక్స్ అందించగా, శంకర్ మహదేవన్, సిద్దార్థ్ మహ దేవన్, శివం మహదేవన్ లు పాడటం జరిగింది. విడుదల అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సాంగ్ ట్రాన్స్ మోడ్ లో ఉంది అంటూ ఇప్పటికే పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్ నటిస్తుండగా, శ్రీకాంత్ మరొక కీలక పాత్ర లో నటిస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :