దీపావళి కానుకగా “అఖండ” టైటిల్ సాంగ్ టీజర్..!

Published on Nov 2, 2021 8:17 pm IST

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తుండగా, తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తుంది.

అయితే దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదిన ఉదయం 11:43 గంటలకు ఈ సినిమా టైటిల్ సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అలాగే ఫుల్ లిరికల్ వీడియోను నవంబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 2న ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More