చాలా కాలం తర్వాత అరుదైన ఫీట్ అందుకున్న “అఖండ”.!

Published on Jan 19, 2022 9:00 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేసిన లేటెస్ట్ సినిమా “అఖండ”. వీరి కెరీర్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన ఈ ప్రాజెక్ట్ భారీ అంచనాల నడుమ ఆ అంచనాలను మించే బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విడుదల అయ్యిన ప్రతి చోట కూడా అఖండ విజయ ఢంకా మోగించింది.

అయితే మళ్ళీ థియేటర్స్ కి పూర్వ వైభవం తెచ్చిన ఈ చిత్రం ఇంకో అరుదైన ఫీట్ అని అందుకుందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో సినిమాలు 50 రోజులు వేడుకలు 100 రోజులు వేడుకలు థియేటర్స్ లో రన్ అయ్యి జరుపుకోవడమే గగనం అయ్యిపోయింది. అందులోని మన తెలుగు రాష్ట్రాల్లో..

అలాంటిది అఖండ ఏకంగా ఓవర్సీస్ లో 50 రోజులు మార్క్ ని క్రాస్ చెయ్యడానికి రెడీగా ఉంది. ఒక్క యూఎస్ లోనే కాకుండా ఆస్ట్రేలియా, కెనడా మరియు న్యూజిలాండ్ లాంటి దేశాల్లో అఖండ ఇప్పుడు 50 రోజుల రన్ ని విజయవంతంగా పూర్తి చేయనుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఒక అరుదైన ఫీట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :