సీడెడ్ లో “అఖండ” స్యూర్ షాట్ గా కొట్టేది ఇంతట.!

Published on Dec 5, 2021 4:00 pm IST

గతంలో నందమూరి బాలకృష్ణ మరియు మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాలు “సింహా” మరియు “లెజెండ్” సినిమాలకు వాటి బాక్సాఫీస్ లెక్కలు రికార్డులు ఎలా చూసుకున్నామో ఇప్పుడు మళ్ళీ తమ హ్యాట్రిక్ సినిమా “అఖండ” తో గుర్తు చేస్తున్నారు. విడుదలైన ప్రతి చోట కూడా ఈ చిత్రం మొదటి రోజు నుంచి భారీ వసూళ్లతో కొనసాగుతూ జెట్ స్పీడ్ లో దూసుకెళ్తుంది.

అయితే ఏపీ మరియు తెలంగాణాలో మంచి స్ట్రాంగ్ గా ఉన్న అఖండ చిత్రం మాస్ సినిమాలకు స్ట్రాంగ్ బేస్ అయ్యినటువంటి సీడెడ్ లో దమ్ము చూపుతున్నట్టు తెలుస్తుంది. అయితే అఖండ చిత్రం అక్కడ మూడో రోజు 1.8 కోట్లు కలెక్ట్ చెయ్యగా ఫైనల్ రన్ లో 12 కోట్లు స్యూర్ షాట్ గా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి సీడెడ్ లో అఖండ ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :