వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా అఖండ

Published on Jan 12, 2022 9:02 pm IST

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ఘన విజయం సాధించడం తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి సిద్దం అవుతుంది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 21 వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి అందుబాటులోకి రానుంది.

ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. శ్రీకాంత్, జగపతి బాబు లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :