బాలయ్య ‘అఖండ’ నుంచి యాక్షన్ టీజర్ !

Published on Oct 12, 2021 1:18 am IST

నటసింహం బాలయ్య – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘అఖండ’. కాగా అక్టోబర్ చివరి నాటికి ఈ సినిమా నుంచి కొత్త టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ దసరాకి టైటిల్ సాంగ్ విడుదల చేయనున్నారు. అలాగే నెలాఖరులో టీజర్ ను రిలీజ్ చేస్తారు. అఖండ రెండో టీజర్ ఇది. మొదటి టీజర్ లాగానే, రెండవది కూడా భారీ యాక్షన్ బ్లాక్‌ లతో రాబోతుంది. ఈ టీజర్ లో కూడా కొన్ని పవర్ ఫుల్ పంచ్ డైలాగ్‌ ఉండబోతున్నాయి.

ఇక ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ హైలైట్‌ గా ఉంటాయట. పైగా బోయపాటి అంటేనే యాక్షన్. అన్నిటికీ మించి గతంలో బాలయ్యతో చేసిన సింహా, లెజెండ్ సినిమాలు బారీ విజయాలు సాధించాయి. మరి ఇప్పుడు చేస్తోన్న సినిమా కూడా హ్యాట్రిక్ అవుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా పై బాలయ్య ఫ్యాన్స్ బాగా హోప్స్ పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం :