అఖండ ట్రైలర్ తో అదరగొట్టిన బాలయ్య !

Published on Nov 14, 2021 7:21 pm IST

నటసింహం బాలయ్య – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న ‘అఖండ’ ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక్కసారిగా సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. ట్రైలర్ లో బాలయ్య నుండి వైవిధ్యం కనిపించడం.. అన్నిటికీ మించి బాలయ్య గెటప్ సెటప్ అందరి పోవడంతో నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఈ ట్రైలర్ చాలా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైలర్ ఎండింగ్ లో బాలయ్య ‘నేనే నేనే’ అంటూ అఖండగా గంభీరమైన వాయిస్ తో పలకడం అదిరిపోయింది. ఇక ట్రైలర్ లో శ్రీకాంత్ లుక్ కూడా బాగుంది.

అసలు బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో సినిమా అంటేనే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉంటాయి. అందుకే మొదటి నుండి బోయపాటి ఈ సినిమా పై మరింత కేర్ తీసుకుని చాలా జాగ్రత్తగా సినిమా తీశాడు. ఈ ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. పైగా ఈ ట్రైలర్ లో పవర్ ఫుల్ డైలాగ్‌ లు కూడా బాగా ఆకట్టుకున్నాయి.

అదేవిధంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ షాట్స్ కూడా హైలైట్‌ గా ఉన్నాయి. బోయపాటి అంటేనే యాక్షన్. అన్నిటికీ మించి గతంలో బాలయ్యతో చేసిన సింహా, లెజెండ్ సినిమాలు భారీ విజయాలు సాధించాయి. మరి ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా కూడా హ్యాట్రిక్ అయ్యేలా ఉంది. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :