“ఏజెంట్” ఫెయిల్యూర్ పై అఖిల్ వ్యాఖ్యలు!

Published on May 16, 2023 12:01 am IST

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్, ఏజెంట్. అయితే, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. నిర్మాతలు మరియు కొనుగోలుదారులకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సాయంత్రం, అఖిల్ మొదటిసారిగా ఏజెంట్ ఫెయిల్యూర్స్ గురించి పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన ఒక నోట్ ను షేర్ చేయడం జరిగింది. ఆ నోట్‌లో, సినిమా ప్రాణం పోసుకోవడం కోసం తమ జీవితాలను అంకితం చేసినందుకు ఏజెంట్ యొక్క తారాగణం మరియు సిబ్బందికి అఖిల్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మేము మా స్థాయిలో ప్రయత్నించాము, దురదృష్టవశాత్తూ ఈ చిత్రం తెరపై మేము కోరుకున్న విధంగా ఆడలేదు. మీ కోసం మంచి చిత్రాన్ని అందించలేకపోయాము అని యువ హీరో అన్నారు. చిత్ర నిర్మాత అనిల్ సుంకరకు అఖిల్ కృతజ్ఞతలు తెలిపాడు. అతని అతిపెద్ద సపోర్ట్ సిస్టమ్ అని పిలిచాడు. ఏజెంట్‌ను నమ్మిన పంపిణీదారులందరికీ మరియు మీడియా వారి అపారమైన మద్దతు కి నటుడు ధన్యవాదాలు తెలిపారు. చివరగా, అఖిల్ తన అభిమానులందరూ తనకు ఇచ్చే ప్రేమ మరియు శక్తి తన పనికి కారణమని చెప్పాడు. అందుకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను నమ్మిన వారందరికీ మరింత బలంగా తిరిగి వస్తాను అని అఖిల్ ముగించాడు.

సంబంధిత సమాచారం :