దసరా బరిలోకి అఖిల్ “ఏజెంట్”ని దింపే ప్లానింగ్..!

Published on Jun 17, 2022 3:00 am IST

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ “ఏజెంట్”. ఈ సినిమా కోసం అఖిల్ మాస్ లుక్‌తో కొత్తగా మేకోవర్ అవ్వడమే కాకుండా సిక్స్ ప్యాక్ బాడీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని రామబ్రహ్మ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను దసరాకి మారుస్తున్నట్టు తెలుస్తుంది. ముందుగా అనుకున్న సమయానికి పనులు కాకపోవడం వల్లనే ఈ సినిమాను అక్టోబర్ 5 లేదా 6 వ తేదిన విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నాడు. హిపాప్ తమిజ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

సంబంధిత సమాచారం :