అది అంతకుమించిన ఒత్తిడి – అఖిల్

Published on Nov 7, 2021 10:02 pm IST

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున నట వారసుడిగా అక్కినేని అఖిల్ తెలుగు చిత్రసీమలో హీరోగా తెరంగ్రేటం చేశాడు. లాస్ట్ సినిమా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో మంచి సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. అఖిల్ మాట్లాడుతూ.. ‘సినిమాల్లోకి వచ్చే ఎవరికైనా సినీ నేపథ్యం ఉండటం అనేది ఓ రకంగా మంచిదే.. అయితే, అంతకుమించిన ఒత్తిడీ ఉంటుంది.

ఫలానా స్టార్ మనవడిగానో లేక, కొడుకుగానో ఎంట్రీ ఇస్తే.. అతనిపై సినిమా సినిమాకీ అభిమానుల్లో అంచనాలు పెరుగుతుంటాయి. ఇక ఈ నేపథ్యం నుంచి బయటకు వచ్చి నాకు నేనుగా నిలబడటం ఓ ఛాలెంజ్‌. ఈ సవాలు స్వీకరించి నన్ను నేను నిరూపించుకునేందుకు కష్టపడుతున్నాను. ప్రస్తుతం ఇతరత్రా ఆలోచనలన్నీ పక్కనపెట్టి పనిమీదే దృష్టి సారిస్తున్నాను’ అని అఖిల్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :