“థాంక్యూ మీట్” లో అఖిల్ అక్కినేని కీలక వ్యాఖ్యలు

Published on Oct 18, 2021 12:02 am IST

అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే హీరో హీరోయిన్ లుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ విజయం సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అఖిల్ అక్కినేని కీలక వ్యాఖ్యలు చేశారు.

వైజాగ్ వచ్చి చాలా రోజులు అయింది, ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథి అవంతి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి, 100 శాతం ఆక్యుపెన్సీ ఇచ్చినందుకు థాంక్స్ తెలిపారు. బన్నీ వాసు, వాసు వర్మ, బొమ్మరిల్లు భాస్కర్ లను అఖిల్ అక్కినేని స్టేజి పైకి పిలిచి మరి, ఇది టీమ్ వర్క్ అని, అందరం కలిసి కథ ముఖ్యం అని నమ్మి తీసినట్లు తెలిపారు. మంచి సినిమా తీద్దాం అని దసరా పండుగ కి వచ్చినట్లు తెలిపారు. ఈ చిత్రం ఇంత విజయం సాధించింది అంటే అందుకు కారణం తెలుగు ప్రేక్షకులే, మీరే అంటూ చెప్పుకొచ్చారు. అందరికీ థాంక్యూ అని అన్నారు. ఫ్యామిలి ఎంటర్ టైనర్ ను ఆదరించినందుకు, ఇప్పుడు నేను మీ ఫ్యామిలీ లో ఒకడిగా ఫీల్ అవుతున్నాను అని అన్నారు. అల్లు అరవింద్ తనకు గాడ్ ఫాదర్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ సినిమా కోసం హీరోయిన్ పూజా హెగ్డే ఎంతగానో కష్టపడింది అని అన్నారు.

సంబంధిత సమాచారం :