టీజర్ రిలీజ్ కి సిద్ధం అవుతోన్న అఖిల్ ‘ఏజెంట్’….?

టీజర్ రిలీజ్ కి సిద్ధం అవుతోన్న అఖిల్ ‘ఏజెంట్’….?

Published on Jul 5, 2022 1:45 AM IST

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఏకే ఎంటరైన్మెంట్స్ బ్యానర్ ఫై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీలో అఖిల్ రా ఏజెంట్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలోని తన పాత్ర కోసం ఇప్పటికే మేకోవర్ లో ఫుల్ చేంజెస్ చేసిన అఖిల్, పూర్తిగా క్రాఫ్ తో పాటు బాడీ పెంచారు. ఎంతో భారీ స్థాయిలో హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఏజెంట్ షూట్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుందట.

స్పై థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కుతున్న ఏజెంట్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక కీ రోల్ చేస్తుండగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ టీజర్ ని త్వరలో విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోందట. ఇక ఫస్ట్ లుక్ టీజర్ తోనే తప్పకుండా మూవీ పై అందరిలో బాగా అంచనాలు ఏర్పడడం ఖాయం అని, ఓవరాల్ గా ఈ మూవీతో హీరోగా అఖిల్ బాగా మార్కెట్ కూడా దక్కించుకుంటారని యూనిట్ అంటోందట. ఆ విధంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి మూవీని అద్భుతంగా తెరక్కించినట్లు తెలుస్తోంది. మరి ఇది నిజం అయితే అక్కినేని అభిమానులకు పండగే ఇక.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు