తన భార్యపై అఖిల్ చేసిన ఫన్నీ కామెంట్స్ వైరల్..!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగా బుల్లితెర స్టార్ గెటప్ శ్రీనుతో అఖిల్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ టాక్ షోలో గెటప్ శ్రీను ఒక కూరగాయల వ్యాపారిలా మారి, అఖిల్‌ను బేరమాడమని ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చాడు. దీనికి అఖిల్ స్పందిస్తూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక సరదా విషయాన్ని పంచుకున్నాడు.

తనకు అస్సలు బేరమాడటం రాదని.. అందుకే తన ఆవిడ తనను బయట ఏ వస్తువు కూడా కొననివ్వదని.. ఆర్థిక విషయాల్లో తనకు పెద్దగా ప్రమేయం ఉండదని.. తాను చాలా సాఫ్ట్ పర్సన్ కావడం వల్లే తనకు బేరాలు చేయడం చేతకాదని.. అందుకే ఆవిడే తనను పక్కన పెట్టి, అలాంటి విషయాలన్నీ స్వయంగా చూసుకుంటుందంటూ అఖిల్ సరదాగా చెప్పుకొచ్చాడు.

అఖిల్ తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ జైనాబ్ రావ్‌జీని కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో 2025 జూన్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత అఖిల్ తన భార్య గురించి ఇలాంటి సరదా విషయాలను పంచుకోవడంతో ఈ ఇంటర్వ్యూ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version