వైరల్ పిక్ : లేటెస్ట్ సిక్స్ ప్యాక్ లుక్ లో అదరగొట్టిన అఖిల్ అక్కినేని

వైరల్ పిక్ : లేటెస్ట్ సిక్స్ ప్యాక్ లుక్ లో అదరగొట్టిన అఖిల్ అక్కినేని

Published on Oct 29, 2022 2:22 AM IST


అఖిల్ అక్కినేని లేటెస్ట్ గా చేస్తున్న మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మాతగా ఎంతో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇందులో కీలక పాత్ర చేస్తున్నారు. ఇటీవల ఫస్ట్ లుక్ టీజర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఏజెంట్ మూవీ పై భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.

అయితే విషయం ఏమిటంటే, అటు సినిమాలతో బిజీగా ఉండే అఖిల్ మధ్యలో తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అప్పుడప్పుడు తన సినీ, వ్యక్తిగత విషయాలకు సంబందించిన సంగతులని ఫ్యాన్స్, ఆడియన్స్ తో పంచుకుంటూ ఉంటారు. ఇక లేటెస్ట్ గా సిక్స్ ప్యాక్ బాడీ లుక్ లో షర్ట్ విప్పి కార్ మీద కూర్చుని ఉన్న పిక్ ని తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసారు. అఖిల్ అదిరిపోయే లుక్ లో ఉన్న ఆ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు