నెగిటివ్ షేడ్స్ పాత్రలో అక్కినేని అఖిల్ !

నెగిటివ్ షేడ్స్ పాత్రలో అక్కినేని అఖిల్ !

Published on May 8, 2022 10:55 PM IST

‘సైరా’ లాంటి భారీ సినిమా చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రస్తుతం ‘ఏజెంట్’ అంటూ అక్కినేని అఖిల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ స్టైలిష్ స్పై థ్రిల్లర్ నుంచి ఒక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో అఖిల్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని.. నెగిటివ్ నుంచి పాజిటివ్ గా ఒక ‘ఏజెంట్’ జర్నీ ఎలా సాగింది అనేది మెయిన్ కథ అట.

ఇక ఈ సినిమాలో అఖిల్ తన నరాలు కూడా బలంగా ఎలివేట్ అయ్యేలా కండలు పెంచి మరీ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ రెండు వేరియేషన్స్ ఎలివేట్ అయ్యేలా రెండు లుక్స్ లో సాలిడ్ పర్సనాలిటీలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

అలాగే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు