‘ఏజెంట్’ కోసం వైజాగ్‌ లో అక్కినేని అఖిల్ యాక్షన్ !

Published on Apr 11, 2022 8:00 am IST

‘సైరా’ లాంటి భారీ సినిమా చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రస్తుతం ‘ఏజెంట్’ అంటూ అక్కినేని అఖిల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ స్టైలిష్ స్పై థ్రిల్లర్ నుంచి ఒక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ను వైజాగ్‌ లో ప్లాన్ చేశారు. అక్కడ ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ ను ప్లాన్‌ చేశారని, ఈ సీక్వెన్స్ ఇంటర్వెల్ లో వస్తుందని తెలుస్తోంది.

కాగా ఈ ‘ఏజెంట్‌’ సినిమాను ఆగస్టు 12న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో అఖిల్ తన నరాలు కూడా బలంగా ఎలివేట్ అయ్యేలా కండలు పెంచి మరీ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ రెండు వేరియేషన్స్ ఎలివేట్ అయ్యేలా రెండు లుక్స్ లో సాలిడ్ పర్సనాలిటీలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

అలాగే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :