ఆ అభిమానిని కలవాలంటున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్..!

Published on Oct 19, 2021 2:16 am IST


అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సూపర్ సక్సెస్‌ని అందుకుని విజయవంతంగా రన్ అవుతుంది. అయితే ఈ సినిమా సక్సెస్‌తో అఖిల్‌కి ఎంత పేరు వచ్చిందో అంతకు మించిన పేరు ఆయన అభిమానికి వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ చివరగా పూజాహెగ్ధే అఖిల్‌ని అయ్యగారు అని పిలుస్తుంది. అయితే సినిమా రిలీజ్ రోజున ఓ అభిమాని అఖిల్‌ని అయ్యగారు అంటూ పిలుస్తూ రచ్చ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.

అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చిన అఖిల్‌ని ఓ అభిమాని “అయ్యగారి అభిమాని” గురుంచి అడిగాడు. దానిపై స్పందించిన అఖిల్ ఆ పిలుపు తన జీవితాన్నే మార్చేసిందని, నిజానికి నాకంటే అతనే ఎక్కువ ఫేమస్‌ అయ్యిండొచ్చు అని, అతడిని తాను తప్పకుండా కలుస్తానని అఖిల్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :

More