ట్రైలర్ టాక్ : ప్రేమ కోసం ‘లెనిన్’ చేసే రక్తాక్షర యుద్ధం..!

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖిల్ లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో అఖిల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, వారికి అదిరిపోయే ట్రీట్‌లా ‘లెనిన్’ ట్రైలర్‌ను కట్ చేశారు మేకర్స్.

ఈ ట్రైలర్ ఆద్యంతం అఖిల్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని అత్యంత పవర్‌ఫుల్ మరియు ఇంటెన్స్ రోల్‌లో అఖిల్ కనిపించాడు. ట్రైలర్ ప్రారంభం నుండి చివరి వరకు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. తన ప్రేమ కోసం ప్రేమికుడు ఎలాంటి యుద్ధం చేశాడు అనేది మనకు ఈ ట్రైలర్ కట్‌లో చూపెట్టే ప్రయత్నం చేశారు.

ఇక లెనిన్ చేసే పోరాటం ఎలా ఉండబోతుందనే పాయింట్‌ను దర్శకుడు చాలా గ్రిప్పింగ్‌గా చూపించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. అఖిల్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ మరియు యాక్షన్ స్టంట్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. లవ్ అండ్ ఎమోషన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ కమర్షియల్ యాక్షన్ డ్రామా అఖిల్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా భారీ తారాగణం నటిస్తోంది. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూలై 10న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version