సూపర్ మూమెంట్ : కిచ్చ సుదీప్ పై సూపర్ కామెంట్స్ చేసిన అఖిల్

Published on Jun 25, 2022 8:00 pm IST

కన్నడ యాక్టర్ కిచ్చ సుదీప్ లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోనా పై కేవలం కన్నడ ఆడియన్స్ లోనే మాత్రమే కాదు, యావత్ ఇతర భాషల ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. జాక్వలీన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని అనుదీప్ భండారి తెరకెక్కించగా షాలిని ఆర్ట్స్, ఇన్వెనియో ఫిలిమ్స్ తో కలిసి హీరో సుదీప్ నిర్మించారు. అయితే ఈ మూవీ ట్రైలర్ ని నిన్న యూట్యూబ్ లో విడుదల చేసిన యూనిట్, కొద్దిసేపటి క్రితం దీని 3డ్ వర్షన్ ప్రీమియర్ ట్రైలర్ ని పలువురు టాలీవుడ్ స్టార్స్ సమక్షంలో హైదరాబాద్ లో రిలీజ్ చేయడం జరిగింది.

ఈ ట్రైలర్ ఈవెంట్ కి స్పెషల్ గెస్టులు గా విచ్చేసిన వారిలో హీరో అఖిల్ మాట్లాడుతూ, టెక్నీకల్ బ్రిలియన్స్, క్రియేటివ్ బ్రిలియన్స్ కలిసి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో విక్రాంత్ రోనా 3డి ట్రైలర్ ఆ విధంగా అద్భుతంగా ఉందని, ఇక హీరో సుదీప్ తనకు పదేళ్లకు పైగా సుపరిచితం అని, ఆయన లుక్స్ పరంగా, మాటల పరంగా మాత్రమే కాదు ముఖ్యంగా ఆయన మైండ్ సెట్ కూడా ఎంతో పవర్ఫుల్ అని ఆయన పై సూపర్ కామెంట్స్ చేశారు. ఇక అఖిల్ తో పాటు ఈ ఈవెంట్ కి విచ్చేసిన వి విజయేంద్ర ప్రసాద్, రామ్ గోపాల్ వర్మ వంటి సినిమా ప్రముఖులు ట్రైలర్ అదిరిపోయిందని, తప్పకుండా మూవీ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా ఈ మూవీ జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :