కన్ఫర్మ్ : ‘వినరోభాగ్యము విష్ణు కథ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా అఖిల్ అక్కినేని

Published on Feb 13, 2023 11:14 pm IST


కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వినరోభాగ్యము విష్ణు కథ. కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ మూవీని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్, టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మరింతగా హైప్ పెంచాయి.

ఇక ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ వారంలో జరగనుండగా దీనికి చీఫ్ గెస్ట్ గా అక్కినేని యువ హీరో అఖిల్ రానున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు కిషోర్ వినరోభాగ్యము విష్ణు కథ మూవీని అద్భుతంగా తెరకెక్కించారని అంటోంది యూనిట్. కాగా ఈ మూవీ ఫిబ్రవరి 18న మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :