చై బాటలోనే అఖిల్.. పెళ్లి అక్కడేనా..?

చై బాటలోనే అఖిల్.. పెళ్లి అక్కడేనా..?

Published on Jan 23, 2025 9:00 PM IST

అక్కినేని ఫ్యామిలీలో ఇటీవల నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు హాజరై వారిద్దరినీ ఆశీర్వదించారు. ఇక ఇప్పుడు మరో అక్కినేని హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. ఇప్పటికే అక్కినేని అఖిల్, జైనాబ్ రవడ్జీ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి వివాహానికి సరైన ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

మార్చి 24న అఖిల్, జైనబ్ మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరి వివాహం తొలుత డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరుపుకోవాలని భావించారట. అయితే, ఇప్పుడు వీరి వివాహాన్ని నాగచైతన్య-శోభిత వివాహ వేదిక అయిన అన్నపూర్ణ స్టూడియోలో జరిపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోతో అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది.

అందుకే ఇక్కడే అఖిల్, జైనాబ్‌ల వివాహం కూడా జరిపేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో అనేది తేలాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు