“బ్యాచ్ లర్” లో వెరీ ఇంట్రెస్టింగ్ పూజా హెగ్డే రోల్.!

Published on Sep 30, 2021 1:35 pm IST

పండుగ సమయం వస్తుంది అంటే టాలీవుడ్ లో సినిమాల హడావుడి ఎంతలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు రానున్న దసరా రేస్ లో రెడీగా ఉన్న పలు చిత్రాల్లో అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” కూడా ఒకటి. ఎప్పుడు నుంచో అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం లో అఖిల్ పూజా జోడీపై మొదటి నుంచి ఇంట్రెస్టింగ్ చర్చలు వస్తూనే ఉన్నాయి.

అయితే అసలు ఈ సినిమాలో పూజా వర్క్ ఎలా ఉంది తన రోల్ ఏంటి? ఎలా కష్టపడింది అన్న వాటిపై అఖిల్ మరియు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. పూజా ఈ సినిమాలో ఒక స్టాండప్ కమెడియన్ రోల్ లో కనిపిస్తుందని భాస్కర్ తెలిపారు. అంతే కాకుండా ఆ రోల్ కి ఆమె సెట్టవుతుందా లేదా అన్న అనుమానాలు కూడా మొదట్లో ఉండేవి అని తెలిపారు.

అలాగే సెట్స్ పూజా హెగ్డే చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది అని వర్క్ పరంగా చాలా సిన్సియర్ గా ఉంటుందని అలాగే తన రోల్ కి మొత్తం హార్ట్ ని పెట్టేసింది అని అఖిల్ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఓ సినిమా షూట్ నుంచి మరో సినిమా షూట్ కి అసలు గ్యాప్ లేకుండా పాల్గొనేది అని తాను చాలా వర్క్ హాలిక్ అని వారు తెలిపారు. మరి దీనిని బట్టి పూజా హెగ్డే రోల్ ఎలా ఉంటుందో తాను ఎంత కష్టపడుతుందో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :