‘హలో’ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించిన అఖిల్ !

అక్కినేని అఖిల్ రెండవ సినిమా ‘హలో’ ప్రస్తుతం చివరి దశల పనుల్లో ఉంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ కోసం అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అఖిల్ కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమైన విశేషాన్ని ప్రకటిస్తానని నిన్న రాత్రి చెప్పిన సంగతి తెలిసిందే. ఆ మాత్రా ప్రకారమే ఆయన చిత్ర టీజర్ విడుదల తేదీని వెల్లడించారు.

నవంబర్ 16 న ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. దీంతో వార్తతో పాటే పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ కూడా ఫస్ట్ లు లానే వెరైటీగా ఉంది. ఇందులో కూడా అఖిల్ యాక్షన్ స్టంట్స్ చేస్తూ కనబడుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.