
టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ అయిన వివి వినాయక్ అక్కినేని నవతరం నటవారాసుడు అక్కినేని అఖిల్ ని హీరోగా తెలుగు పరిచయం చేస్తూ చేస్తున్న సినిమా ‘అఖిల్’. రెం పాటల మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా బిజినెస్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోందని ఇది వరకే తెలియజేశాం. అఖిల్’ మూవీ రైట్స్ కి నైజాంలో 13 కోట్లు, కృష్ణా జిల్లా 2.5 కోట్లకి అమ్ముడు పోతే సీడెడ్ లో సుమారు 7 కోట్లకి డీల్ క్లోజ్ అయ్యేలా ఉంది. ఇక్కడ సంథింగ్ స్పెషల్ గా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే అఖిల్ తన మొదటి సినిమాతోనే ఓ అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేయనున్నాడు.
అదేమింటంటే సుమారు 20 ఏళ్ళ కెరీర్లో నరగార్జున ఏ సినిమాకి రాని భారీ భారీ అమౌంట్స్ కి ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అవుతూ ఉండడం. దాదాపు అన్ని ఏరియాల్లోనూ ఇప్పటి వరకూ నాగార్జున సినిమా ఆ రేంజ్ రేటు పలకలెదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం మొదటి సినిమాతోనే బిజినె పరంగా నాగార్జున రికార్డ్స్ ని క్రాస్ చేసేసాడని చెప్పుకోవాలి. ఇది నాగార్జునకి కూడా సంతోషాన్ని ఇచ్చే విషయం అనే చెప్పాలి. ఎందుకంటే తన కుమారుడు తన కళ్ళ ముందే తన రికార్డ్స్ ని బ్రేక్ చేసి ఉన్నత స్థానాలకు వెళ్తుంటే ఏ తండ్రికి మాత్రం గర్వంగా ఉండదు చెప్పండి.
‘అఖిల్’ సినిమా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ 55 కోట్లని టచ్ చేస్తుందని సమాచారం. అఖిల్ – సయేషా సైగల్ హీరో – హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ చేయనున్నారు. నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు.