టైటిల్ నిర్ణయించుకునే పనిలో ఉన్న అఖిల్ !


మొదటి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ మధ్యే ఒక సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం అఖిల్ బాగా కష్టపడుతున్నారు. లుక్స్ పరంగా, బాడీ పరంగా కొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి టైటిల్ నిర్ణయించే విషయమై చర్చలు జరుగుతున్నాయి.

;ఎక్కడ ఎక్కడ ఉందో తారక, హలో గురు ప్రేమ కోసమే రా’ వంటి పేర్లను పరిశీలిస్తున్నా ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు టీమ్. ఇకపోతే డిసెంబర్ 22ను ఈ చిత్ర విడుదల తేదీగా కూడా నిర్ణయించారు. నాగార్జున ప్రత్యేక పర్యవేక్షణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి పి. ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.