అఖిల్ కి తోడుగా రానా !

అఖిల్ అక్కినేని చేస్తున్న రెండవ చిత్రం ‘హలో’ ఈ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. మొదటి నుండి పాజిటివ్ క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమా యొక్క ఆడియోకు కూడా మంచి స్పందన లభిస్తోంది. దీంతో చిత్ర నిర్మాత నాగార్జున సినిమాను మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కలెక్షన్లకు కీలకంగా మారిన యూఎస్ లో సైతం అఖిల్ చేత ప్రమోషన్లు చేయిస్తున్నారు.

ఈ ప్రమోషన్ల కోసం అఖిల్ యూఎస్ బయలుదేరి వెళ్లారు. అఖిల్ తో పాటే రానా దగ్గుబాటి కూడా ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకుల్ని కలవనున్నారు. ఈ ప్రమోషన్లలో రకరకాల కార్యక్రమాల్ని ప్లాన్ చేశారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడం మూలాన ఈ సినిమాపై ఓవర్సీస్ ప్రేక్షకుల్లో కూడా మంచి బజ్ నెలకొంది ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంతో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా పరిచయం కానుంది.