‘హలో’ టిజర్ వచ్చేది అప్పుడే !
Published on Nov 16, 2017 12:34 pm IST

అఖిల్ తన రెండో సినిమా ‘హలో’ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. అఖిల్ సరసన ‘కళ్యాణి’ కథానాయికగా నటిస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈసినిమాను నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. హలో పోస్టర్స్ బాగున్నాయని బయట టాక్ వినిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు టిజర్ విడుదల కానుంది.

హలో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు అనుప్ రూబెన్స్ సంగీతం అందించారు. ప్యూర్ లవ్ స్టోరి తో కూడిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు జోడించి దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. అఖిల్ ఈ సినిమాతో హిట్ కొడతాడని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉండడం విశేషం.

 
Like us on Facebook