నాగార్జున సినిమాలో కనిపించనున్న అఖిల్?

Published on Oct 22, 2021 3:00 am IST


టాలీవుడ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున కాంబోలో “ఘోస్ట్ ” అనే ఓ సాలిడ్ చిత్రాన్ని అనౌన్స్ చెయ్యగా దానిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు మరియు అలాగే నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమాలో అమలాపాల్ హీరోయిన్‌గా నటిస్తుంది.

అయితే అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే అదే నిజమైతే అసలు అఖిల్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడోనని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీతో వచ్చిన ఈ యంగ్ హీరో మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.

సంబంధిత సమాచారం :

More