సెప్టెంబర్ 15న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లెహరాయి లిరికల్ సాంగ్..!

సెప్టెంబర్ 15న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లెహరాయి లిరికల్ సాంగ్..!

Published on Sep 11, 2021 7:34 PM IST


అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి సెప్టెంబర్ 15న ‘లెహరాయి’ లిరికల్ సాంగ్ విడుదల కానుంది. ఈ మేరకు అఖిల్, పూజ హెగ్డే రొమాంటిక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇకపోతే త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌ ఉండేలా డిజైన్ చేసే దర్శకుడు భాస్కర్ ఈ సినిమాలో కూడా అన్ని పాత్రలను రొమాంటిక్‌గానే చూపించబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు