అఖిల్ మూడో సినిమాకు డైరెక్టర్ ఖరారు ?
Published on Jan 21, 2018 1:13 am IST

భారీ అంచనాలతో వెండితెర అరంగేట్రం చేసిన అఖిల్ తన మొదటి సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ రెండో సినిమాతో సత్తా చాటాడు. తాజాగా ఈ హీరో మూడో సినిమాపై ద్రుష్టి పెట్టాడు. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చెయ్యబోతున్నరనే విసయంపై రకరకాల పేర్లు వినిపించాయి.

ఆది పినిశెట్టి అన్న సత్య పినిశెట్టితో అఖిల్ మూడో సినిమా చేస్తున్నాడని టాక్ వచ్చింది. ఈ డైరెక్టర్ చెప్పిన 2 స్టోరీస్ లో ఒకటి ఫైనలైజ్ చేసి ఈ నెల 10న అధికారికంగా అనౌన్స్ చెయ్యబోతున్నారని వార్తలు వచ్చాయి. కాని అవేవి నిజం కాదు. తాజా సమాచారం మేరకు కొరటాల శివ అఖిల్ మూడో సినిమా చెయ్యబోతునట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దానయ్య ఈ సినిమాను నిర్మించాబోతున్నాడు. భరత్ అనే నేను సినిమా తరువాత కొరటాల, అఖిల్ సినిమా ప్రారంభం కానుందని సమాచారం..

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook