పర్ఫెక్ట్ స్పై లా అఖిల్..అవైటెడ్ “ఏజెంట్” రిలీజ్ ఫిక్స్.!

పర్ఫెక్ట్ స్పై లా అఖిల్..అవైటెడ్ “ఏజెంట్” రిలీజ్ ఫిక్స్.!

Published on Oct 24, 2022 12:19 PM IST


అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ చిత్రం “ఏజెంట్” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా ఆడియెన్స్ సహా మన టాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఫైనల్ గా అయితే ఈ చిత్రంపై బిగ్ అప్డేట్ ని మేకర్స్ ఫైనల్ గా రిలీజ్ పై ఇచ్చేసారు. అఖిల్ పై ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని రివీల్ చేసి ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. దీనితో ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ఈ అవైటెడ్ అప్డేట్ ఫైనల్ గా క్లారిటీ వచ్చేసింది.

ఇక ఈ పోస్టర్ లో కూడా అఖిల్ అయితే చాలా డిఫరెంట్ గా మంచి ఇంటెన్స్ లుక్ లో ఓ పర్ఫెక్ట్ స్పై లా లెవెల్లో కనిపిస్తున్నాడు. మొత్తానికి అయితే ఈ అవైటెడ్ సినిమా రిలీజ్ పై మేకర్స్ తుది క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు