బయటపడ్డ అఖిల్ లోని సరికొత్త టాలెంట్
Published on Jul 1, 2017 9:28 am IST


అక్కినేని యంగ్ హీరో గ్లామర్ లుక్ తోనే కాదు..అదిరిపోయే స్టెప్పులతోనూ ఆకట్టుకుంటాడు. సైమా 2017 అవార్డ్స్ వేదికగా ఈ అక్కినేని వారసుడి నుంచి బయటకు వచ్చిన కొత్త టాలెంట్ అందరిని ఆశ్చర్య పరిచింది. గత సైమా వేడుకలలో అఖిల్ డాన్స్ అదరగొట్టాడు. కాగా గత రాత్రి అబుదాబిలో జరిగిన సైమా వేడుకలలో అఖిల్ పాల్గొన్నాడు. స్టేజి పై ఓ పాట పాడి అందరిని ఆశ్చర్య పరిచాడు.

ప్రస్తుతం అఖిల్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలోని ‘ఏవేవో కలలు కన్నా’ అనే పాటని పాడాడు. ఈ వేడుకకు హాజరైన అతిథులంతా అఖిల్ వాయిస్ కు మంత్ర ముగ్దులయ్యారు. అఖిల్ ఖచ్చితంగా ఒకరోజు ప్లే బ్యాక్ సింగర్ గా మారతాడని అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.

 
Like us on Facebook