మూడో సినిమా వివరాలు ప్రకటించనున్న అఖిల్ !

27th, December 2017 - 12:30:57 PM

అక్కినేని నటవారసుడిగా వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో అఖిల్, మొదటి సినిమాతో నిరాశ పరిచినా రెండో సినిమా హలో తో మంచి విజయం అందుకున్నాడు. హలో సినిమాలో తన నటన డాన్స్ తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. హలో సక్సెస్ అవ్వడంతో నాగార్జున సంతోషంగా ఉన్నడు.

ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అఖిల్ తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తన తదుపరి సినిమాకు రెడీ అవుతున్నానని ఆ సినిమా వివరాలు జనవరి 10 న వెల్లడిస్తానని ప్రకటించాడు. అఖిల్ మూడో సినిమా కు సంభందించి రకరకాల డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. కాని సినిమా ఎవరు చేస్తున్నారనేది అఖిల్ చెప్పబోతున్నాడు.