రామ్ చరణ్ కు పోటీగా దిగుతున్న అఖిల్ !
Published on Jul 26, 2017 8:39 am IST


అక్కినేని అఖిల్ ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు నాగార్జున. డిసెంబర్ అంటే క్రిస్టమస్ నెల కాబట్టి సినిమా వసూళ్లకు బాగా తోడ్పడుతుంది. కానీ అదే నెలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘రంగస్థలం 1985’ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్.

ఎందుకంటే ఈ సంవత్సరం రావాల్సిన పవన్ – త్రివిక్రమ్ సినిమా ఆలస్యమవుతుండటంతో దాన్ని 2018 సంక్రాంతికి రిలీజ్ చేసి అప్పుడు రావాల్సిన రంగస్థలాన్ని 2017 డిసెంబర్ కు విడుదలచేయాలని మెగా కాంపౌండ్ భావిస్తోందని అంటున్నారు. అంతేగాక గత ఏడాది చరణ్ ‘ధృవ’ కూడా డిసెంబర్ నెలలో వచ్చే మంచి విజయాన్ని అందుకుంది. కాబట్టి ఆ సెంటిమెంట్ ను కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. మరి భారీ అంచనాలున్న ఈ రెండు సినిమాలు ఒకే నెలలో విడుదలైతే గట్టి పోటీ ఖాయమనే చెప్పాలి.

 
Like us on Facebook