లైవ్ లో అఖిల్ డాన్స్ !

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున నిర్మాతగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హలో’. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్ సాంగ్ ప్రోమో బాగున్నాయి. ముఖ్యంగా సాంగ్ ప్రోమోలో అఖిల్ డాన్స్ ఆడియన్స్ ను అలరిస్తోంది.

ఈ రోజు నాగార్జున ఈ సినిమా ప్రొమోషన్స్ లో మాట్లాడుతూ.. డిసెంబర్ 10న వైజాగ్ లో జరగబోయే హలో సినిమా ఆడియో వేడుకలో అఖిల్ లైవ్ లో డాన్స్ వెయ్యబోతున్నాడంట. ఈనెల 22న విడుదల కానున్న ఈ సినిమా పై మంచి అంచానాలుఉన్నాయి. అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ జగపతిబాబు అఖిల్ కు పేరెంట్స్ గా నటించారు. సుమారు రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా తో అఖిల్ విజయం అందుకుంటాడని ఆశిద్దాం.