నవంబర్ లో అక్కినేని అఖిల్ కొత్త సినిమా

akhil
మొదటి సినిమా ‘అఖిల్’ తో మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుదామనుకున్న అక్కినేని వారసుడు అఖిల్ కు ఆ ప్రయత్నం నిరాశను మిగిల్చింది. ఆ తరువాత అఖిల్ వంశీ పైడిపల్లి, హను రాఘపూడి వంటి దర్శకులతో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అవేమీ జరగలేదు. అఖిల్ మాత్రం చాలా కాలం గ్యాప్ తీసుకుని బాగా ఆలోచించి కెరీర్లో కీలకమైన స్టెప్ తీసుకుని తన రెండవ సినిమాను తమ కుటుంబానికి ‘మనం’ వంటి గొప్ప క్లాసిక్ ను అందించిన విక్రమ్ కుమార్ తో నిర్ణయించుకున్నాడు.

ఈ మేరకు విక్రమ్ కుమార్ తో కథా పరమైన చర్చలు ముగిశాయని, మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్ రెడీ అయినదని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని ఈ నవంబర్ నుండి మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.