పాటల చిత్రీకరణలో అఖిల్3 !

Akhil1
యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న మూడవ చిత్ర షూటింగ్ లండన్ లో జరుగుతుంది. తొలి ప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రకరణ ను జరుపుకుంటుంది . ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నేతృత్వంలో పాటలను చిత్రీకరిస్తున్నారు.

ఇక ‘అఖిల్’చిత్రంతో డాన్స్ ఎంత భాగా చేయగలనోనని నిరూపించుకున్నాడు అఖిల్ . ఈచిత్రంలో కూడా ఆయన అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టనున్నడని సమాచారం . రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తుంది . తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎస్ వి సి సి పతాకం ఫై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు . అక్టోబర్ నెలలో దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు .

Exit mobile version